Sunday, April 12, 2009

చాలా లేటుగా మరో పోస్ట్ రాస్తున్నాను ఇప్పుడు అంట రాజకీయం మీద వుండి మన రాష్ట్రము. మనం మన యువత అనే వారు ఓటుని నోటు కోసం వినియోగించకుండా మంచిగా ఓటు వెయ్యాలి అని నా మనవి.

మంచి ఎంచుకో నీ ఓటు వినియోగించుకోండి యువత గర్జిస్తే ప్రభుత్వాలే కూలిపోతాయి అందుకు యువతరం మంచి ప్రభుత్వాని enchukovali

Sunday, March 29, 2009

మనం ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అని పట్టు పట్టకుండా చిన్నదైన వెతుక్కుని చేస్తే అది పెద్దది అవుతుంది ఎప్పుడో ఉద్యోగం వస్తుంది లే అని కాలం గడపడం మంచిది కాదు. చిన్న కవిత వ్రాస్తున్నాను చదవండి.

ఉద్యోగం ఉద్యోగం నిరుద్యోగం, కాంట్రాక్ట్ ఉద్యోగం మహాభాగ్యం

చూపించు ఆ ఉద్యోగంలో టాలెంట్ అది నీ కీర్తి కి తోలి మెట్టు

తిరుతున్నవారి గురించి ఆలోచించకు, నువ్వు అలా తిరగాలి అనుకోకు

రికమెండషన్లు నమ్ముకోకు, నీ టాలెంట్ ని అమ్ముకోకు

వ్యసనం నీకు ఇప్పుడు ఆనందం, తరువాత అది నీ గుండెకి చేస్తుంది రంద్రం

ఓ యువత నాశనం చేసుకోకు నీ బ్రతుకుని, ఆనందమయం చేసుకో నీ జీవితాన్ని.

మేలుకో యువత మేలుకో ......

నీ ఆప్తుడు...... రమణ.......

ఇక అసలు విసయనికి వస్తే చాలామంది నిరుద్యోగులు అది చేద్దాము ఇది చేద్దాము అని కాలయాపన చేస్తారు గాని నిజాంగా శ్రద్ద పెట్టారు అందుకు నా ఆలోచన ఏంటి అంటే మీరు డిగ్రీ చదివిన వారైతే ముందుగ గ్రూప్స్ మీద ఇంట్రెస్ట్ చూపించండి తరువాత ఆర్. ఆర్. బి, ఎస్.ఎస్.సి, బ్యాంకు పోస్ట్లు వీటిని ప్రిపేరు అవ్వండి. దేనికైనా ముందు మినిమం నాలెడ్జ్ ఇంగ్లీష్ లో ఉండాలి కాబట్టి జనరల్ ఇంగ్లీష్ నేర్సుకోండి. రెన్ & మరిన్, ఎన్. డి. వి. ప్రసాదు, స్వస్తిక్, వి.జి.ఎస్. వారి బుక్స్ చాల వున్నాయి వాటిని రెగ్యులర్ గా మీకు మేరు గానే ప్రిపేరు కావస్సు.
చాలమంది మెటిరియల్ లేదు ఎలా చదువుతాం అనుకుంటారు కాని మన దగ్గరే బోల్డు మెటిరియల్ వుంటుంది మనం చదివిన పది, ఇంటర్, డిగ్రీ బుక్స్ చదవాలి. అలాగే ఇప్పుడు కామన్ సిలబస్ పెట్టారు కాబట్టి ౩వ తరగతి నుండి పది వ తరగతి వరకు వుండే సోషల్, సైన్సు, చదివితే సగం గ్రూప్స్ మెటిరియల్ సంపాదించి నట్టిగే.

Thursday, March 26, 2009

ఈ ప్రపంచములో చాలా మందికి చాలా ఆలోచనలు ఉంటాయి కానీ వాటిని వ్యక్త పరచడానికి ఒక వేదిక కావాలి అదే బ్లాగు అని నా అభిప్రాయం.
ఈ బ్లాగు ప్రారంబించడానికి ఒక కారణం వుంది నా మనుసులో వుండే భావాలూ కాగితం మీద పెట్టిన పదిమందికి చేరడానికి సమయం పడుతుంది అందుకే నేను ఎంచుకున్న మార్గం ఈ బ్లాగు.
ముఖ్యంగా నేను నిరుద్యోగులు కోసం ఈ బ్లాగుని తయారుచేసాను.